మద్యం మత్తులో వేగంగా కారు నడిపిన ఓ యువకుడు సిగ్నల్ స్తంభాన్ని ఢీకొట్టిన ఘటన తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ లోని... వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న హస్తినాపురంలో ఈ తెల్లవారుజామున జరిగింది. ఈ ప్రమాదంలో.. కారులోనే ఉన్న మరో వ్యక్తి.. వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.
సాగర్ రోడ్ నుంచి ఇబ్రహీంపట్నం వైపు ప్రమాణిస్తున్న కారు (TS 05 FH 2356) హస్తినాపురంలో సిగ్నల్ స్తంభాన్ని ఢీకొట్టి డివైడర్ పైకి ఎక్కింది. ఆ సమయంలో వాహనాన్ని నడిపిన గౌతమ్ అనే యువకుడు మద్యం మత్తులో ఉన్నాడని పోలీసులు చెప్పారు. కారులోని సందీప్ అనే యువకుడు తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. కారు నడిపిన గౌతమ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.