couple suicide in galiveedu: జీవితంపై విరక్తితో దంపతుల ఆత్మహత్య.. అసలేం జరిగిందంటే..? - బోరెడ్డిగారిపల్లిలో వృద్ధ దంపతుల ఆత్మహత్య
11:57 January 04
couple suicide in galiveedu: కడప జిల్లా గాలివీడు మండలం బోరెడ్డిగారిపల్లిలో దంపతుల ఆత్మహత్య
couple suicide in galiveedu: జీవితంపై విరక్తితో వృద్ధ దంపతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన కడప జిల్లా గాలివీడు మండలం బోరెడ్డిగారిపల్లిలో చోటుచేసుకుంది. ఆనందరెడ్డి(75), రుక్మిణమ్మ(73) దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. వారు గతకొంత కాలంగా ఆస్తుల విషయమై తల్లిదండ్రులతో గొడవపడ్డారు. దీంతో ఎవరికి వారు తల్లిదండ్రులను వదలి దూరంగా వెళ్లి జీవిస్తున్నారు.
తల్లిదండ్రులు అనారోగ్యంతో బాధపడుతున్నా కూడా పిల్లలు చూడడానికి రాకపోవడంతో... జీవితంపై విరక్తి చెందిన వృద్ధ దంపతులు విష ద్రావణం తీసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వారి మృతదేహాలను లక్కిరెడ్డిపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
ఇదీ చదవండి:Narsipuram road accident: ట్రాక్టర్‌ను ఢీకొట్టి కారు.. తాతా, మనువడు దుర్మరణం