ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

పిల్లల గొంతు కోసి.. తానూ కోసుకున్న తల్లి.. పరిస్థితి విషమం

చిత్తూరు జిల్లాలో దారుణం జరిగింది. కుటుంబ కలహాలతో ఇద్దరు పిల్లల గొంతు కోసిన తల్లి.. తానూ ఆత్యహత్యాయత్నం చేసింది. కుప్పం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.

mother cut the child's throat
పిల్లల గొంతు కోసిన తల్లి

By

Published : Mar 26, 2021, 4:21 PM IST

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పిల్లలు

చిత్తూరు జిల్లా వి.కోట మండలం అట్రపల్లెలో దారుణం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో ఓ మహిళ తన ఇద్దరు పిల్లల గొంతుకోసి.. తానూ ఆత్మహత్యాయత్నం చేసింది. వెంటనే విషయం తెలుసుకున్న స్థానికులు, బంధువులు ప్రాణాపాయస్థితిలో ఉన్న ముగ్గురిని కుప్పం ఆసుపత్రికి తరలించారు. కుటుంబ కలహాలే ఈ ఘాతుకానికి కారణమని పోలీసులు తెలిపారు.

అట్రపల్లెకు చెందిన ఆనంద్ అతని భార్య మీనాక్షికి ఐదేళ్ల కుమార్తె, ఏడేళ్ల కుమారుడు ఉన్నారు. కొద్ది కాలంగా భార్యాభర్తల మధ్య కుటుంబ సమస్యలు తలెత్తటంతో మనస్తాపానికి గురైన తల్లి మీనాక్షి ఇద్దరు పిల్లల గొంతుకోసి.. తానూ ఆత్మహత్యాయత్నం చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందన్న పోలీసులు..కుప్పం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details