ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

Mahesh Bank Server hacking Case: మహేశ్​ బ్యాంకు కేసులో బయటపడుతున్న కొత్త కోణాలు... - మహేశ్​ బ్యాంక్ సర్వర్ హ్యాకింగ్

Mahesh Bank Server hacking Case : తెలంగాణలో సంచలనం సృష్టించిన మహేశ్​ బ్యాంకు కేసులో కొత్త కోణాలు బయటపడుతున్నాయి. ఈ వ్యవహారంలో మణిపుర్ రాష్ట్రంతో సంబంధాలున్నట్లు పోలీసుల విచారణలో వెలుగు చూసింది. తాజాగా మణిపుర్​కి చెందిన యువతిని కస్టడీలోకి తీసుకుని విచారించారు.

Mahesh Bank Server hacking Case
Mahesh Bank Server hacking Case

By

Published : Feb 14, 2022, 2:18 PM IST

Mahesh Bank Server hacking Case : తెలంగాణలో కలకలం సృష్టించిన మహేశ్ బ్యాంకులో నిధులు కొల్లగొట్టిన కేసులో కొత్త కోణాలు బయటపడుతున్నాయి. ఈ వ్యవహారంలో మణిపుర్ రాష్ట్రంతో సంబంధాలున్నట్టు పోలీసుల విచారణలో వెలుగు చూసింది. సర్వర్‌ హ్యాక్‌ చేసిన నైజీరియన్లు 12 కోట్ల రూపాయలకు పైగా ఇతర ఖాతాల్లోకి మళ్లించారు. ఈ కేసులో సైబర్‌ క్రైం పోలీసులు ఇప్పటికే పలువురిని అరెస్టు చేశారు.

Mahesh Bank Server hacking Updates : వీరిలో మణిపుర్ రాష్ట్రానికి చెందిన యువతిని తాజాగా కస్టడీకి తీసుకున్న పోలీసులు.. ఆమెను విచారించారు. ఆమె బ్యాంకు ఖాతాలో హ్యాకర్లు జమ చేసిన 52 లక్షల రూపాయాల్లో కొంత మేర స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కేసుతో సంబంధం ఉందని భావిస్తున్న.. మరో మణిపుర్ యువతి దిల్లీలో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్న ఆమె ఐదేళ్ల క్రితం బెంగళూరు నుంచి దిల్లీకి వెళ్లింది. ఇద్దరు యువతులకు పాత పరిచయాలున్నాయా? హ్యాకర్లకు ఏ విధంగా సహాయ పడ్డారు? అనే విషయాలను పోలీసులు లోతుగా ఆరా తీస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details