ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

BEAR ATTACK: బహిర్బూమికి వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి - ఎలుగుబంటి దాడి

వేకువజామున బహిర్బూమికి వెళ్లిన ఓ వ్యక్తిపై ఎలుగుబంటి దాడి చేసింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ వ్యక్తిని కుటుంబ సభ్యులు స్థానికు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటన అనంతపురం జిల్లా గొడగట్టలో జరిగింది.

man-severely-injured-in-a-bear-attack
బహిర్బూమికి వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి

By

Published : Sep 11, 2021, 10:52 AM IST

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం సమీపంలోని దొడగట్ట గ్రామంలో... బహిర్భూమికి వెళ్లిన ఓ వ్యక్తిపై ఎలుగుబంటి దాడి చేసి తీవ్రంగా గాయపరించింది. విషయం గుర్తించిన కుటుంబ సభ్యులు క్షతగాత్రుడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.

దొడగట్ట గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ నాగేంద్ర ఉదయంపూట బహిర్భూమికి వెళ్లాడు. ఈ క్రమంలోనే ఎలుగుబంటి ఒక్కసారిగా చెట్ల పొదల చాటు నుంచి నాగేంద్రపై దూకి దాడి చేసింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన నాగేంద్రను కుటుంబ సభ్యులు హుటాహుటిన కళ్యాణదుర్గం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కళ్యాణదుర్గం ప్రాంతంలో ఎలుగుబంట్ల సంచారంగా ఎక్కువగా ఉంటోంది. ఇంటినుంచి బయటకు వెళ్లాలంటే ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

ఇదీ చూడండి:మహిళ మెడలోంచి గొలుసు లాక్కెళ్లిన దుండగుడు

ABOUT THE AUTHOR

...view details