Kidnap: తీసుకున్న అప్పు తిరిగి చెల్లించకపోవడంతో తనఖా పెట్టిన భూమిని అమ్మేశాడనే కోపంతో రెక్కీ నిర్వహించి కిడ్నాప్ చేసిన ఘటన.. గుంటూరు జిల్లా తెనాలిలో జరిగింది. గల్లా శ్రీనివాస్ అనే న్యాయవాదికి.. రియల్ ఎస్టేట్ వ్యాపారి కోగంటి బాబ్జి నాలుగేళ్ల కిందట 10లక్షలు అప్పుగా ఇచ్చారు. ఏళ్లు గడుస్తున్నా తీసుకున్న అప్పు తిరిగి చెల్లించకపోవడంతో.. తనఖా పెట్టిన పొలాన్ని బాబ్జి అమ్మేశారు.
తనఖా పెట్టిన భూమిని అమ్మేశాడని వ్యక్తి కిడ్నాప్ - భూమిని అమ్మేశాడని వ్యక్తి కిడ్నాప్
Kidnap:తీసుకున్న అప్పు తిరిగి చెల్లించకపోవడంతో తనఖా పెట్టిన భూమిని అమ్మేశాడనే కోపంతో రెక్కీ నిర్వహించి కిడ్నాప్ చేసిన ఘటన.. గుంటూరు జిల్లా తెనాలిలో చోటుచేసుకుంది. పోలీసుల ఒత్తిడితో కిడ్నాప్ చేసిన వ్యక్తులే మూడవ పట్టణ పోలీసు స్టేషన్ వద్ద వదిలి వెళ్లారని.. బాధితుడు వెల్లడించారు.
తనఖా పెట్టిన భూమిని అమ్మేశాడని వ్యక్తి కిడ్నాప్
ఆ కక్షతోనే పలు రకాలగా తనను ఇబ్బంది పెడుతున్నారని బాబ్జి ఆరోపించారు. అందులో భాగంగానే స్వర్ణముఖి అపార్ట్మెంట్స్ దగ్గర నలుగురు వ్యక్తులతో కలిసి రెక్కీ నిర్వహించారని తెలిపారు. స్థానికులు, కుటుంబ సభ్యలు పోలీసులకి సమాచారమివ్వడంతో.. తనని విడిచి పెట్టినట్లు బాబ్జి తెలిపారు.