ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

భార్యపై భర్త దాడి.. పోలీసులు వెతుకుతున్నారని తెలిసి.. - crime news in ap

SUICIDE: ఆ దంపతుల మధ్య గొడవ జరిగింది.. దీంతో భర్త.. భార్యపై కత్తితో కిరాతకంగా దాడి చేశాడు.. ఏం జరుగుతుందోనని భయంతో అక్కడినుంచి పారిపోయాడు. పోలీసులు వెతుకుతున్నారనే సమాచారంతో.. నాలుగు రోజుల తర్వాత బలవన్మరణానికి పాల్పడ్డాడు.. దాడి చేసింది రెండో భార్యపైన అని.. మొదటి భార్యను సైతం అలాగే హింసించి హత్య చేశాడని స్థానికులంటున్నారు. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే?

SUICIDE
SUICIDE

By

Published : Jul 23, 2022, 3:12 PM IST

SUICIDE: కృష్ణాజిల్లా బాపులపాడు మండలంలోని మల్లవల్లి గ్రామంలో నాలుగు రోజుల క్రితం భార్యపై కత్తితో దాడి చేసిన పులయ్య అనే వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పుల్లయ్య ఇటీవలే తన రెండో భార్య రమ్యపై దాడి చేసి పారిపోయాడు. రమ్యను గమనించిన కూలీలు ఆసుపత్రిలో చేర్పించి.. పోలీసులకు సమాచారం అందించారు. అయితే పరారీలో ఉన్న పుల్లయ్యపై వీరవల్లి పోలీసులు కేసు నమోదు చేసి.. అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

పోలీసులు వెతుకుతున్నారన్న విషయం తెలుసుకున్న పుల్లయ్య.. ప్రాణభయంతో వీరవల్లిలోని ఓ మామిడి తోటలో ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గన్నవరం ఆసుపత్రికి తరలించినట్లు వీరవల్లి ఎస్సై సుబ్రహ్మణ్యం తెలిపారు. పుల్లయ్య గతంలో కూడా మొదటి భార్యను గొడ్డలితో నరికి హత్య చేసినట్లు స్థానికులు తెలిపారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details