Man Commits Suicide Day Before Wedding :సహజీవనం చేస్తున్న మహిళను పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నాడు. ఈనెల 25న వివాహానికి ఏర్పాట్లు చేసుకోగా సోమవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన తెలంగాణ రాజధాని హైదరాబాద్ రాజేంద్రనగర్ ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై శ్వేత వివరాల మేరకు... కడప జిల్లా కొండాపురానికి చెందిన విజయ్‌కుమార్(40)కు 15 ఏళ్ల క్రితం వివాహమైంది. అదే జిల్లాలో రైల్వే స్టేషన్ మాస్టర్‌గా పనిచేస్తున్నాడు. భార్యకు దూరంగా ఉంటున్నాడు.
హైదరాబాద్ నగరంలోని టప్పచపుత్రాలో నివసించే మహిళతో ఎనిమిదేళ్ల కిందట పరిచయమైంది. సంవత్సర కాలంగా వీరిద్దరూ రాజేంద్రనగర్ ఉప్పర్‌పల్లిలోని ఓ అపార్ట్‌మెంట్లో సహజీవనం చేస్తున్నారు. ఈ నెల 25న వివాహం చేసుకోవాలని నెలరోజుల క్రితమే నిర్ణయం తీసుకున్నారు. వారం రోజుల క్రితం విజయ్‌కుమార్ ఆ మహిళకు చెప్పకుండా వెళ్లిపోయాడు. ఆమె టప్పచపుత్రా ఠాణాలో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసును రాజేంద్రనగర్ ఠాణాకు బదిలీచేశారు. రాజేంద్రనగర్ పోలీసులు ఆదివారం విజయ్‌కుమార్, ఆ మహిళను ఠాణాకు పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించి పంపించారు.