ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

వివాహితపై గొడ్డలితో దాడి.. నిందితుడు అరెస్ట్, పీడీ యాక్ట్ నమోదు - man attacked with a axe on married woman in gurramguda

రంగారెడ్డి జిల్లా మీర్​పేట్ పీఎస్​ పరిధిలోని గుర్రంగూడలో సోమవారం ఓ వివాహితపై గొడ్డలితో దాడి చేసిన నిందితుణ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహిళపై దాడి చేసి ద్విచక్రవాహనంపై పారిపోయిన రాహుల్​ను మీర్​పేట్ పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి గాలించారు. ఎట్టకేలకు బుధవారం ఉదయం అతణ్ని అరెస్టు చేశారు.

attacked with a axe on married woman
man attacked with a axe on married woman in gurramguda

By

Published : Feb 4, 2021, 1:03 AM IST

రంగారెడ్డి జిల్లా గుర్రంగూడ టీచర్స్‌కాలనీలో సోమవారం సాయంత్రం వివాహితపై గొడ్డలితో దాడి చేసిన రాహుల్ గౌడ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అబ్దుల్లాపూర్‌మెట్‌కు చెందిన రాహుల్‌గౌడ్‌పై గతేడాది డిసెంబర్ 27న మీర్‌పేట పోలీస్ స్టేషన్‌లో బాధితురాలు విమల వేధింపుల కేసు పెట్టారు. నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు జనవరి రెండున రిమాండ్ చేశారు.

వివాహితపై గొడ్డలితో దాడి

జైలుకు వెళ్లి వచ్చిన రాహుల్ గౌడ్ విమలపై పగ పెంచుకుని సోమవారం సాయంత్రం గొడ్డలితో విచక్షణా రహితంగా దాడికి దిగాడు. విమల కుడి చేతి వేళ్లతో పాటు... కుడి భుజంపై గాయాలయ్యాయి. ద్విచక్రవాహనంపై వచ్చిన నిందితుడు ఒక్క ఉదుటన బాధితురాలిపై గొడ్డలితో విరుచుకుపడ్డాడు. అక్కడే ఉన్న మరో మహిళ భయంతో వణికిపోయారు. దాడిచేసిన కిరాతకుడు ద్విచక్రవాహనంపై పారిపోయాడు.

నిందితుడి కోసం 4 బృందాలుగా ఏర్పడి గాలించిన పోలీసులు అతన్ని అరెస్ట్‌ చేశారు. బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా ప్రాణాపాయం లేదని పోలీసులు తెలిపారు. నిందితుడు దాడికి దిగిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి.

లొంగదీసుకునేందుకు యత్నం....

గొడ్డలితో దాడిచేసిన రాహుల్​ గౌడ్​ను... 48 గంటలలోపే బాహ్యవలయ రహదారి సమీపంలో పట్టుకున్నట్టు వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తం రెడ్డి తెలిపారు. గత కొంతకాలంగా బాధితురాలి కుటుంబంతో సన్నిహితంగా ఉన్న రాహుల్​... ఆమెను లొంగదీసుకునేందుకు యత్నించినట్టు పేర్కొన్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు రాహుల్‌ను గతంలో అరెస్టు చేసి, జైలుకు పంపినట్లు పేర్కొన్నారు.

ఇటీవల జైలు నుంచి బెయిల్​పై వచ్చిన నిందితుడు... ఆమెను హతమార్చేందుకు నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే ఆమెపై గొడ్డలితో దాడి చేయగా... తీవ్రంగా గాయపడినట్టు తెలిపారు. నిందితుడిని అరెస్టు చేసి... సీపీ సూచనల మేరకు పీడీ చట్టం నమోదు చేసి, రౌడ్​ షీట్​ కూడా ఓపెన్​ చేసినట్టు ఏసీపీ వెల్లడించారు. నిందితుడి నుంచి గొడ్డలి, మొబైల్, ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ చూడండి:జైలుకు పంపిందన్న కక్షతో.. వివాహితపై గొడ్డలి దాడి

ABOUT THE AUTHOR

...view details