ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

Cheating in Love: ప్రియుడు కాదన్నాడని.. ఉరేసుకుని జూనియర్‌ ఆర్టిస్ట్‌ బలవన్మరణం - telugu Crime News

ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. కలిసిబతకాలని అనుకున్నారు. హైదరాబాద్​ ఫిలింనగర్‌లో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని సహజీవనం చేస్తున్నారు. ఇంతలో ఏమైందో తెలియదు... కట్​ చేస్తే.. అతనికి మరో యువతితో నిశ్చితార్థం. ఇంకేముంది... బాధిత యువతి.. ఫ్యాన్​కు ఉరేసుకుని బలవన్మరణం (SUICIDE) చెందింది.

junior artist commit suicide at Hyderabad
junior artist commit suicide at Hyderabad

By

Published : Sep 30, 2021, 11:49 AM IST

కుళ్లిన స్థితిలో ఓ జూనియర్‌ ఆర్టిస్ట్‌ మృతదేహం (DEAD BODY FOUND) లభ్యమైన ఘటన హైదరాబాద్​ బంజారాహిల్స్‌ ఠాణా పరిధిలో చోటుచేసుకొంది. పోలీసుల కథనం ప్రకారం.. కుత్బుల్లాపూర్‌ సమీపంలోని గాజుల రామారం ప్రాంతానికి చెందిన కావలి అనురాధ(22) మూడు నెలలుగా కిరణ్‌ అనే యువకుడితో కలిసి ఫిలింనగర్‌లోని జ్ఞానిజైల్‌సింగ్‌ నగర్‌లోని ఓ ఇంటి రెండో అంతస్తులోని గదిలో నివసిస్తోంది. ఆమె నివసిస్తున్న గది నుంచి దుర్వాసన వస్తుండటంతో ఇంటి కింద నివసించే కొందరు యువకులు మంగళవారం రాత్రి విషయాన్ని యజమాని దృష్టికి తీసుకెళ్లారు.

బంజారాహిల్స్‌ పోలీసులకు సమాచారం అందించడంతో వారు అక్కడికి చేరుకున్నారు. గదిలోకి వెళ్లి చూడగా ఫ్యానుకు చీరతో వేలాడుతూ కుళ్లిన స్థితిలో అనురాధ మృతదేహం కనిపించింది. కిరణ్‌తో దాదాపు ఆరేళ్లుగా ప్రేమలో ఉందని, పెళ్లి చేసుకుంటానని నమ్మించడంతో కలిసి నివసిస్తోందని కుటుంబ సభ్యులు పోలీసుల దృష్టికి తీసుకొచ్చారు. ఆమెకు తెలియకుండా కిరణ్‌ మరో యువతితో నిశ్చితార్థం చేసుకున్నాడని, ఈ మోసాన్ని భరించలేకనే తన సోదరి తనువు చాలించిందని మృతురాలి సోదరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్‌ పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. నిందితుడైన కిరణ్‌ కోసం గాలిస్తున్నారు.

ఇదీ చదవండి:

Murder: నాలుగు నెలల పసికందు హత్య.. గొంతు నులిమి చంపిన మేనమామ..

ABOUT THE AUTHOR

...view details