International drug gang arrested: హైదరాబాద్లో మాదక ద్రవ్యాల సరఫరాపై నగర పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా రాచకొండలో డ్రగ్స్ సరఫరా చేస్తోన్న అంతర్జాతీయ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి పెద్ద మొత్తంలో మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని అరెస్టు చేసిన మల్కాజ్గిరి పోలీసులు.. నిందితుల నుంచి 8 కిలోల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన సొత్తు విలువ దాదాపు రూ. 9 కోట్లు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ ముఠా హైదరాబాద్ నుంచి కొరియర్ ద్వారా విదేశాలకు మాదకద్రవ్యాలు సరఫరా చేస్తున్నట్లు వెల్లడించారు.
హైదరాబాద్లో ఇంటర్నేషనల్ డ్రగ్స్ ముఠా అరెస్ట్.. రూ.9 కోట్ల విలువైన మాదకద్రవ్యాలు స్వాధీనం - సుమారు రూ 9 కోట్లు విలువైన డ్రగ్స్ స్వాధీనం
International drug gang arrested: హైదరాబాద్లో మరో డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు అయ్యింది. రాచకొండలో డ్రగ్స్ సరఫరా చేస్తోన్న అంతర్జాతీయ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి పెద్ద మొత్తంలో మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు.
International drug gang arrested