ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

ఒంటరి మహిళలే టార్గెట్.. నకిలీ ఖాతాలతో బురిడీ.. ఇద్దరు ఆఫ్రికన్ల అరెస్ట్​ - సీపీ గజరావు భూపాల్​ మీడియా సమావేశం

Two foreigners arrested for cheating women: సామాజిక మాధ్యమాల ద్వారా ఒంటరి మహిళలను టార్గెట్​ చేసి.. వారి నుంచి డబ్బులు వసూళ్లు చేస్తున్న ఇద్దరు విదేశీయులను హైదరాబాద్​ పోలీసులు అరెస్టు చేశారు. సామాజిక మాధ్యమాల్లో నకిలీ ఖాతాల ద్వారా ఒంటరి మహిళలకు వల వేసి.. వారి నుంచి అధిక మొత్తంలో డబ్బులు లాక్కుంటున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Two foreigners arrested for cheating womens
Two foreigners arrested for cheating womens

By

Published : Oct 15, 2022, 10:59 PM IST

Two foreigners arrested for cheating women: సామాజిక మాధ్యమాల్లో నకిలీ ఖాతాలు సృష్టించి.. ఒంటరి మహిళలను టార్గెట్​ చేసి వారి నుంచి అధిక మొత్తంలో డబ్బులు లాక్కుంటున్న ఇద్దరు విదేశీలను హైదరాబాద్​ పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్​ సీసీఎస్​ సంయుక్త సీపీ గజరావు భూపాల్​ తెలిపిన వివరాల ప్రకారం.. బేగంపేటకు చెందిన ఓ యువతి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మహిళలను మోసం చేస్తున్న ఓ నైజీరియన్​తో పాటు మరో వ్యక్తిని అరెస్టు చేసినట్లు తెలిపారు.

ఒంటరి మహిళలే టార్గెట్.. నకిలీ ఖాతాలతో బురిడీ.. ఇద్దరు ఆఫ్రికన్ల అరెస్ట్​

స్నేహానికి గుర్తుగా బంగారం, ఎలక్ట్రానిక్ వస్తువులను పంపించామని మహిళలను నమ్మించి.. ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారుల పేరిట ఫోన్లు చేసి డబ్బులు లాగినట్లు తెలిపారు. నిందుతుల నుంచి ల్యాప్​టాప్​, ఖరీదైన ఫోన్లు, సిమ్​ కార్డులు స్వాధీనం చేసుకున్నట్లు గజరావు భూపాల్​ వివరించారు.

"బేగంపేటకు చెందిన ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదుతో ఇన్​స్ట్రాగ్రామ్​ ద్వారా నకిలీ ఖాతా సృష్టించి మహిళల దగ్గర డబ్బులు లాగేస్తున్న ఆఫ్రికాకు చెందిన ఇద్దరు యువకులను అరెస్టు చేశాం. స్నేహానికి గుర్తుగా బంగారం, ఎలక్ట్రానిక్ వస్తువులను పంపించామని మహిళలను నమ్మిస్తారు. ఆ తరువాత ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారుల పేరిట ఫోన్లు చేసి డబ్బులు లాక్కుంటారు. వారి దగ్గర నుంచి సిమ్​కార్డులు, ల్యాప్​టాప్​ స్వాధీనం చేసుకున్నాం".-గజరావు భూపాల్​,సీసీఎస్​ సంయుక్త సీపీ

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details