ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

Gold Cheating: బంగారానికి మెరుగు పెడతామంటూ వచ్చి.. - telangana news

Gold Cheating: బంగారు ఆభరణాలకు మెరుగు పెడతామంటూ మాయ మాటలతో నమ్మించి, నిలువెత్తున ముంచేందుకు ప్రయత్నించారు ఇద్దరు దుండగులు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు పీఎస్​ పరిధిలో చోటుచేసుకుంది.

బంగారానికి మెరుగు పెడతామంటూ వచ్చి..
Gold Cheating

By

Published : Dec 11, 2021, 8:06 PM IST

Gold Cheating: బంగారాన్ని మెరుగుపెడతామని వచ్చి ఓ మహిళను నిలువెత్తున ముంచేందుకు యత్నించారు ఇద్దరు దుండగులు. నల్లగా ఉన్న బంగారాన్ని రసాయనంలో ముంచి తళతళలాడేలా చేస్తామని మాయమాటలు చెప్పి మోసం చేసేందుకు ప్రయత్నించిన నిందితులను స్థానికులు పట్టుకున్నారు.

బంగారానికి మెరుగు పెడతామంటూ వచ్చి..

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరులోని లక్కదొడ్డి కాలనీకి చెందిన సుకన్య అనే మహిళ ఇంటికి బిహార్​కు చెందిన ఆనంద్​కుమార్​ సాహా, రాజ్​కుమార్​ సాహాలు వచ్చారు. బంగారు పుస్తెలతాడు శుభ్రం చేసి ఇస్తామని చెప్పి తీసుకున్నారు. వారి వెంట తెచ్చుకున్న కొన్ని రసాయనాల్లో ఈ పుస్తెలతాడును శుభ్రం చేస్తున్నామని వాటిలో ముంచారు. ఆ రసాయనంలో ముంచడంతో మూడు తులాలు గల పుస్తెల తాడు రెండు తులాలు కరిగిపోయి ఒక తులమే మిగిలింది. పుస్తెలతాడు తెగిపోయే విధంగా మారింది.

ఈ నేపథ్యంలో సుకన్యకు అనుమానం వచ్చింది. ఆ ఇద్దరిని నిలదీసేలోపే వారు పరారయ్యేందుకు ప్రయత్నించారు. సుకన్య గట్టిగా అరవడంతో చుట్టుపక్కల వారు వచ్చి ఆ ఇద్దరిని పట్టుకున్నారు. వారిద్దరిని పటాన్​చెరు పోలీస్​స్టేషన్​లో అప్పగించారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నేరవిభాగం సీఐ శ్రీనివాస్​ తెలిపారు.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..

లక్కదొడ్డి ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు ఆనంద్​కుమార్​ సాహా, రాజ్​కుమార్​ సాహాలు బంగారు ఆభరణాలను మెరుగుపెడతామని సుకన్య అనే మహిళ ఇంటికి వెళ్లారు. ఆమె తన పుస్తెలతాడు శుభ్రం చేయమని ఇచ్చింది. వారు పుస్తెలతాడును రసాయనంలో వేయగానే కరిగి తెగే స్థితికి వచ్చింది. ఆమెకు అనుమానం వచ్చి భర్తకు, చుట్టుపక్కల వారికి ఫోన్​ చేసి తెలపగా వారు నిందితులను పట్టుకుని పీఎస్​కు తీసుకొచ్చారు. సుకన్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నాం. కొత్త వారు ఎవరైనా వచ్చి ఇలా అడిగితే అప్రమత్తంగా ఉండాలి. ఏదైనా అనుమానం వస్తే పోలీసులను సంప్రదించాలి.-శ్రీనివాస్​, పటాన్​చెరు సీఐ

ఇదీ చదవండి:

Theft in Gold Shop: బంగారు షాపులో చోరీ.. ఇంటి దొంగల పనేనా?

ABOUT THE AUTHOR

...view details