తెలంగాణలోని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా జీహెచ్‌ఎంసీ కాప్రా సర్కిల్ డీహెచ్‌ఎంసీ డీఈ మహాలక్ష్మి అ.ని.శా.(ACB)కు చిక్కారు. స్వీపర్ నుంచి లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. జీహెచ్‌ఎంసీ మహిళా స్వీపర్ అనారోగ్యంతో ఇటీవల మృతి చెందగా... భార్య ఉద్యోగం భర్తకు ఇచ్చేందుకు లంచం డిమాండ్ చేసినట్లు బాధితుడు తెలిపారు. మల్లాపూర్ హోటల్‌లో లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు అ.ని.శా. అధికారులు వెల్లడించారు. డీఈ మహాలక్ష్మి నివాసంలో సోదాలు జరుపుతున్నారు.
TS News: అ.ని.శాకు చిక్కిన జీహెచ్ఎంసీ డీఈ - తెలంగాణ వార్తలు
జీహెచ్‌ఎంసీ కాప్రా సర్కిల్ డీఈ మహాలక్ష్మి అ.ని.శా.(ACB)కు చిక్కారు. స్వీపర్ నుంచి లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. మహిళా స్వీపర్ భర్తకు ఉద్యోగం ఇచ్చేందుకు లంచం డిమాండ్ చేసినట్లు బాధితుడు తెలిపారు.
GHMC DE caught to ACB