Five passengers seriously injured: డ్రైవర్ నిర్లక్ష్యం.. అతివేగం ఐదుగురు ప్రయాణికుల ప్రాణాల మీదకు తెచ్చిన ఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. సంక్రాంతి పండగ అనంతరం కనుమ సందర్భంగా వారంతా, దైవ దర్శనానికి బయలు దేరిన కొద్ది సేపటికే ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఐదుగురికి తీవ్ర గాయాలు కాగా.. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ప్రమాదానికి ఆటో డ్రైవర్ అతివేగంతో వాహనాన్ని నడపడమే కారణం అంటూ స్థానికులు పేర్కొన్నారు.
అనంతపురం జిల్లాలో ఆగి ఉన్న లారీని ఢీకొన్న ఆటో.. ఐదుగురికి తీవ్రగాయాలు - జాతీయ రహదారిపై ప్రమాదం
Auto rammed the parked lorry: ఆటో డ్రైవర్ నిర్లక్ష్యం, అతివేగం కారణంగా చోటు చేసుకున్న ప్రమాదంలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన అనంతపురం జిల్లా పామిడి పట్టణంలోని 44వ నంబర్ జాతీయ రహదారిపై రోడ్డుపై చోటుచేసుకుంది. క్షతగాత్రులను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
అనంతపురం జిల్లా పామిడి పట్టణం 44 వనంబర్ జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని వెనుకనుంచి అతివేగంతో ఆటో ఢీ కొట్టింది. ఆ సమయంలో ఆటోలో ప్రయాణిస్తున్న 5గురికి తీవ్రంగా గాయాలయ్యాయి. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో అనంతపురం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. కనుమ పండుగ సందర్భంగా దైవ దర్శనానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుందని బాధితులు తెలిపారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని హైవేపై ట్రాఫిక్కు అంతరాయం కలుగకుండా చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.
ఇవీ చదవండి: