తెలంగాణ పెద్దపల్లి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 15 మంది గాయపడ్డారు. డివైడర్ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు రహదారి పక్కనే ఉన్న కాలువలోకి దూసుకెళ్లింది. రామగుండం మండలం మల్యాలపల్లి వద్ద ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను వెంటనే గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
కాలువలోకి దూసుకెళ్లిన బస్సు.. 15 మందికి గాయాలు
డివైడర్ ఢీకొట్టిన బస్సు కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 15 మంది గాయపడ్డారు. తెలంగాణ పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం మల్యాలపల్లి వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. క్షతగాత్రులను గోదావరిఖని ఆస్పత్రి తరలించి చికిత్స అందిస్తున్నారు.
కాలువలోకి దూసుకెళ్లిన బస్సు
ప్రమాదకర మలుపే కారణం...
కరీంనగర్ నుంచి మంచిర్యాలకు వెళ్తున్న బస్సు మల్యాలపల్లి క్రాస్ రోడ్డు వద్ద డివైడర్ను ఢీకొంది. ప్రమాదకరమైన మలుపు వద్ద వేగం నియంత్రించ లేక పోవటంతో ప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న పోలీసులు గాయపడినవారిని 108 వాహనంలో గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బస్సులో మొత్తం 30 మంది ప్రయాణికులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.