చిత్తూరు జిల్లాలో ఏనుగు మంద బీభత్సం సృష్టించింది. జోగివారిపల్లె పొలాల్లో నిద్రిస్తున్న ఎల్లప్ప అనే రైతును ఏనుగుల గుంపు తొక్కి చంపాయి. ఏనుగుల గుంపు పంటపొలాలను ధ్వంసం చేస్తుండటంతో కాపలా కోసం వెళ్లిన రైతు … అక్కడే నిద్రిస్తుండగా గజరాజులు దాడి చేశాయి. తీవ్రంగా గాయపడిన ఎల్లప్ప ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
పాపవినాశనంలో వాహనదారులను వెంబడించిన ఏనుగులు.. జోగివారిపల్లె పొలాల్లో రైతును తొక్కిన గజరాజు - Chittoor district News
08:49 March 31
జోగివారిపల్లె పొలాల్లో నిద్రిస్తున్న రైతును తొక్కిన ఏనుగు
పాపవినాశనం రహదారి వెంట ఏనుగుల సంచారం..
తిరుమల పాపవినాశనం రహదారి వెంట ఏనుగుల మంద సంచారం చేస్తున్నాయి. నాలుగు రోజులుగా పాపవినాశనం దారిలో తిష్ఠవేసిన ఏనుగులు... తిరుమల ఆకాశగంగ ప్రాంతంలో రహదారిపైకి వచ్చాయి. దారిలో వెళ్తున్న ద్విచక్ర వాహనదారులపై ఏనుగులు దాడికి యత్నించడంతో వారు తీవ్ర భయాదోంళనకు గురయ్యారు. కొద్దిసేపు రొడ్డుపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. తిరిగి ఏనుగులను అడవిలోకి మళ్లించేందుకు తితిదే, అటవీశాఖ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.
ఇదీ చదవండి:Srisailam: శ్రీశైలంలో కన్నడ భక్తుల హల్చల్.. పలు వాహనాలు, దుకాణాలు ధ్వంసం