ARREST : అనంతపురం జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో అనేక రకాల పేర్లతో ప్రజలకు పరిచయమై నకిలీ బంగారు ఆభరణాలు అంటగట్టే ముఠా సభ్యులను మంగళవారం రాయదుర్గం గ్రామీణ సీఐ యుగంధర్, బొమ్మనహాల్ ఎస్సై శివ అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
నకిలీ బంగారు ఆభరణాలు అమ్మే ముఠా అరెస్ట్, రిమాండ్కు తరలింపు - ap crime news
GANG ARREST ప్రజలకు వేర్వేరు పేర్లతో పరిచయమై వారికి మాయమాటలు చెప్పి నకిలీ బంగారాన్ని అంటగట్టి డబ్బు సంపాదించడం ఈ నేరగాళ్ల నైజం. మాట వింటే సరాసరి లేకపోతే దాడికి సైతం వెనకాడరు. అలాంటి దోపిడి దొంగలను అనంతపురం జిల్లా రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటక రాష్ట్రంలోని విజయనగర జిల్లా కసాపురం గ్రామానికి చెందిన సి.రాకేష్ అలియాస్ రమేష్, కావలి బాలకృష్ణ సాంగ్లియన్ అనే ఇద్దరు వ్యక్తులు ఒక్కొక్క ప్రాంతంలో వేర్వేరు పేర్లతో ప్రజలకు పరిచయమై నకిలీ బంగారు ఆభరణాలను అమ్మి సొమ్ము చేసుకునేవారు. ఈనెల 20వ తేదీన కర్ణాటక ప్రాంతానికి చెందిన కొందరు వ్యాపారులు.. మేకలు, గొర్రెలు కొనుగోలు చేయడానికి అనంతపురం జిల్లా బొమ్మనహాల్ మండలానికి వచ్చారు. ఇది గమనించిన దోపిడీ దొంగలు దేవగిరి క్రాస్ రోడ్లో మారణాయుధాలతో బెదిరించి రూ. 2 లక్షలు నగదు దోచుకెళ్లినట్లు బాధితులు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తాజాగా బొమ్మనహాల్ చెక్పోస్ట్ వద్ద తనిఖీలు చేస్తుండగా విజయనగర జిల్లాకు చెందిన దోపిడీ దొంగలు రాకేష్, కావలి బాలకృష్ణ సాంగ్లియన్ కారులో వస్తుండగా అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి ఒక కారు, రూ.1.50 లక్షల నగదు, 2 బంగారు చైన్లు, 3 బంగారు ఉంగరాలు, 850 నకిలీ బంగారు నాణేలాను స్వాధీనం చేసుకున్నాం' అని రాయదుర్గం సీఐ యుగంధర్ వివరించారు.
ఇవీ చదవండి: