ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

విజయవాడలో విదేశీ సిగరెట్లు స్వాధీనం.. విలువ ఎంతంటే? - foreign cigarettes seized in vijayawada

FOREIGN CIGARETTE SEIZED
FOREIGN CIGARETTE SEIZED

By

Published : Aug 30, 2022, 6:37 PM IST

Updated : Aug 30, 2022, 9:34 PM IST

18:33 August 30

కేసరపల్లి వద్ద లారీల్లో తరలిస్తుండగా పట్టుకున్న కస్టమ్స్ అధికారులు

FOREIGN CIGARETTE SEIZED: విజయవాడ నగరంలో అక్రమంగా రవాణా చేస్తున్న 8 కోట్ల రూపాయలు విలువ చేసే విదేశీ సిగరెట్లను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడు, బిహార్ రాష్ట్రాలకు చెందిన లారీల్లో భారీగా విదేశీ సిగరెట్లు స్మగ్లింగ్ జరుగుతుందనే సమాచారమందుకున్న అధికారులు నిఘా ఉంచారు. కేసరపల్లి వద్ద లారీలను తనిఖీ చేయగా 80 లక్షల పారిస్ బ్రాండ్ సిగరెట్లు బయటపడ్డాయి. బిహార్​లోని పాట్నా నుంచి విజయవాడకు సరఫరా చేస్తున్నట్లు దర్యాప్తులో తేలిందని అధికారులు పత్రికా ప్రకటనలో తెలిపారు. అత్యధిక లాభాల కోసం అక్రమార్కులు విదేశీ సిగరెట్లను రవాణా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. విజయవాడలో సరుకును దిగుమతి చేసుకునే వ్యక్తి ఎవరా అని కస్టమ్స్ అధికారులు ఆరా తీస్తున్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Aug 30, 2022, 9:34 PM IST

ABOUT THE AUTHOR

...view details