ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

Cracker Blast: బాలుడి మర్మాంగాలపై టపాసులు కాల్చి.. వీడియో వైరల్​ చేసి.. - ఆంధ్రప్రదేశ్ వార్తలు

హైదరాబాద్​లో షాకింగ్​ ఘటన చోటుచేసుకుంది. ఉపాధి నిమిత్తం నగరానికి వచ్చిన ఓ 16 ఏళ్ల బాలుడి మర్మాంగాలపై కొందరు యువకులు బాణాసంచా పేల్చారు. ఆ మొత్తం తతంగాన్ని వీడియో తీసి సోషల్​మీడియాలో వైరల్​ చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

cracker blasted in teen private part
బాలుడి మర్మాంగాలపై టపాసుల వైరల్​ వీడియో

By

Published : Nov 1, 2022, 10:33 PM IST

హైదరాబాద్​లోని గండిమైసమ్మ గుడి ప్రాంతంలో అమానుషమైన ఘటన చోటుచేసుకుంది. ఓ 16 ఏళ్ల బాలుడిని పట్టుకుని మర్మాంగాలపై టపాసులు పేలుస్తూ వీడియో తీసిన దారుణమైన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఉత్తర్​ప్రదేశ్​ ఖుషీనగర్​కు చెందిన 16 ఏళ్ల బాలుడిని.. బాసరగుడిలోని టపాసుల కర్మాగారంలో పని చేసేందుకు వారి బంధువులు మూడు నెలల క్రితం పంపించారు. కొన్ని రోజుల నుంచి ఆ బాలుడిని ఇబ్బందులకు గురిచేస్తున్న స్థానిక యువకులు.. అత్యంత దారుణానికి ఒడిగట్టారు.

బాలుడుని కదలకుండా గట్టిగా పట్టుకున్న యువకులు.. వదిలిపెట్టాలని ఏడుస్తూ బతిమాలినా కనికరించలేదు. మర్మాంగాలపై టపాసులు పేలుస్తూ.. వీడియో తీసి పైశాచికానందానికి పాల్పడ్డారు. తర్వాత ఈ వీడియోను సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేశారు. బాధితుడి సెల్​ఫోన్ కూడా లాక్కున్నారు. వైరల్ వీడియో ద్వారా సమాచారం తెలుసుకున్న బాధితుడి తల్లిదండ్రులు.. ఘటనపై యూపీలోని ఖుషీనగర్​ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ కుమారుడు మానసిన వైకల్యంతో ఇబ్బందిపడుతున్నారని తల్లింద్రుడులు చెప్పారు.

బాలుడి మర్మాంగాలపై టపాసులు కాల్చి.. వీడియో వైరల్​

ఇవీ చూడండి..

ABOUT THE AUTHOR

...view details