Child died due to the negligence of the doctors in ap: అప్పటి వరకు ఆడుతూ పాడుతూ తిరిగిన చిన్నారికి జ్వరం రావడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. గ్రామంలో ఉన్న ఆర్ఎంపీకి చూపించారు. అయినప్పటికీ పాప జ్వరం తగ్గలేదు. వైద్యుడి సూచనమేరకు ఆ చిన్నారిని కందుకూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు ఆ పాప తల్లిదండ్రులు. అయితే ఆసుపత్రి నిర్లక్ష్యం కారణంగానే అప్పటి వరకు బాగానే ఉన్న చిన్నారి మృతి చెందిందని చిన్నారి తల్లిదండ్రులు బంధువులు ఆరోపిస్తున్నారు.
నెల్లూరు జిల్లా కందుకూరు వంద పడకల ప్రభుత్వ వైద్యశాలలో చిన్నారి మృతి చెందిన ఘటన కలకలం రేపింది. వైద్యుల నిర్లక్ష్య కారణంగా పసికందు మృతి చెందిన సంఘటన కందుకూరు ప్రభుత్వ వైద్యశాలలో చోటుచేసుకుంది. పొన్నలూరు మండలం బాలిరెడ్డి, పాలెం గ్రామానికి చెందిన ఆరు సంవత్సరాల పుష్ప అనే బాలికకు తీవ్ర జ్వరం వచ్చింది. ఆ చిన్నారి తల్లిదండ్రులు నిన్న కందుకూరు ప్రభుత్వ వైద్యశాలకు తీసుకువచ్చారు. ఈరోజు ఉదయం బాలిక మృతి చెందింది. పాప మృతి చెందిన ఘటనకు డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. సమయానికి సరైన వైద్యం అందించకపోవడం వల్లనే బాలిక మృతి చెందినట్లు బంధువుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.