చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్నను హైదరాబాద్లోని చిలకలగూడ పోలీసులు అరెస్ట్ చేశారు. తనను డబ్బులు డిమాండ్ చేస్తూ బెదిరింపులకు దిగుతున్నారని మారుతీ జ్యోతిష్యాలయం వ్యవస్థాపకులు లక్ష్మీకాంత శర్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన బాధితులు కొందరిని ఫోన్లో మాట్లాడిస్తూ యూట్యూబ్ ఛానెల్లో లైవ్ టెలికాస్ట్ ఇచ్చారని.. తప్పుడు వార్తలు ప్రచారం చేయకుండా ఉండాలంటే రూ.30 లక్షలు ఇవ్వాలని తనను మల్లన్న బెదిరించారని లక్ష్మీకాంత శర్మ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు మల్లన్నను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. అనంతరం తీన్మార్ మల్లన్నను అరెస్టు చేశారు.
TEENMAR MALLANNA ARREST: తీన్మార్ మల్లన్న అరెస్ట్ - telangana top news
తీన్మార్ మల్లన్నను చిలకలగూడ పోలీసులు శుక్రవారం రాత్రి అరెస్ట్ చేశారు. డబ్బుల కోసం బెదిరిస్తున్నారని తీన్మార్ మల్లన్నపై కేసు నమోదైంది. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. తీన్మార్ మల్లన్నను అరెస్ట్ చేశారు.
mallanna