Cell phones and laptops theft from container: హరియాణాకు చెందిన కంటైనర్ చోరీకి పాల్పడింది. కంటైనర్‌లో ఉన్నసామాగ్రిని కంటైనర్ డ్రైవరే చోరీకి పాల్పడినట్లు తెలిసింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. సుమారు కోటి రూపాయలు విలువచేసే సెల్ఫోన్లు, ల్యాప్‌ట్యాప్‌లు ఆ కంటైనర్ లో ఉన్నట్లు తెలిసింది. దాదాపు పది రోజులు క్రిందట ముంబై నుంచి చెన్నైకి కంటైనర్ బయలుదేరిందని.
కంటైనర్ నుంచి సెల్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు చోరీ.. ఎవరి పనంటే..!
Cell phones and laptops theft from container: పేనుకి పెత్తనం ఇస్తే తలంతా గొరిగిందనట్టుగా కంటైనర్‌లో సామగ్రి తరలించమంటే.. ఓ డ్రైవర్ అందులో ఉన్న వస్తువులనే దొంగలించాడు. కంటైనర్‌లో సుమారు కోటి రూపాయలు విలువ చేసే సెల్ ఫోన్లు, ల్యాప్‌ట్యాప్‌లు తరలిస్తుండగా.. డ్రైవర్ వాహనాన్ని మధ్యలోనే వదిలేసి వస్తువులతో ఉడాయించాడు.
హరియాణాకు చెందిన డ్రైవర్ దిల్లీ నుంచి హైదరాబాదు అక్కడ నుంచి కడపకు వచ్చి మార్గమధ్యంలో కంటైనర్‌లో ఉన్న సెల్ఫోన్లు, ల్యాప్‌ట్యాప్‌ల చోరీ జరిగిందని.. వాహనాన్ని కడప రింగురోడ్డు వద్ద వదిలి వెళ్లిపోయారని కడప పోలీసులు తెలిపారు. పోలీసుల ప్రాథమిక విచారణలో కంటైనర్ డ్రైవరే చోరీకి పాల్పడినట్లు తేలిందన్నారు. డ్రైవర్‌తోపాటు మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. ఈ విషయం ఇవాళ వెలుగులోకి రావడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, చోరీ వెనకాల ఎవరి హస్తమైనా ఉందా? అనే కోణంలో విచారిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
ఇవీ చదవండి: