ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 29, 2021, 3:01 PM IST

Updated : Jun 29, 2021, 3:45 PM IST

ETV Bharat / crime

Ruia Case: రుయా ఆసుపత్రిలో హత్య కేసు.. సీసీటీవీ ఫుటేజీ విడుదల

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన తిరుపతి రుయా ఆసుపత్రి ఆవరణలోని హత్య కేసు సీసీటీవీ ఫుటేజీని పోలీసులు విడుదల చేశారు. డీబీఆర్ రోడ్​లోని ఓ అపార్ట్​మెంట్​లో భార్యను హతమార్చి సూట్ కేసులో మృతదేహాన్ని పెట్టి తరలిస్తున్న దృశ్యాలను బయటపడ్డాయి.

cctv footage of near ruia murder incident r
భార్యను హతమార్చి సూట్ కేసులో తరలిస్తున్న భర్త శ్రీకాంత్ రెడ్డి

భార్యను హతమార్చి సూట్ కేసులో తరలిస్తున్న భర్త శ్రీకాంత్ రెడ్డి

రుయా ఆస్పత్రి ఆవరణలో సూట్ కేసులో కాలిన మృతదేహం కేసుకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలను పోలీసులు విడుదల చేశారు. భార్యను హతమార్చి సూట్ కేసులో మృతదేహాన్ని పెట్టిన నిందితుడు శ్రీకాంత్ రెడ్డి.. ఆ సూట్ కేసును బయటకు తీసుకెళ్తున్న దృశ్యాలు బయటపడ్డాయి. డీబీఆర్ రోడ్​లోని ఓ అపార్ట్​మెంట్ నుంచి మృతదేహం ఉన్న సూట్ కేసును బయటకు తీసుకు వచ్చి టాక్సీలోకి ఎక్కించిన దృశ్యాలను పోలీసులు విడుదల చేశారు. హత్య ఉదంతం అనంతరం పరారైన నిందితుడు శ్రీకాంత్ రెడ్డిని కర్నూలు జిల్లాలో అదుపులోకి తీసుకుని తిరుపతికి తరలిస్తున్నారు.

ఇదీ చదవండి:

Last Updated : Jun 29, 2021, 3:45 PM IST

ABOUT THE AUTHOR

...view details