CBI CASE FILED ON ABHIJEET GROUP : అభిజిత్ గ్రూపు పేరిట బ్యాంకులను రూ.4,037 కోట్లకు మోసం చేసిన కార్పొరేట్ పవర్ లిమిటెడ్ సంస్థ, డైరెక్టర్లపై సీబీఐ కేసు నమోదు చేసింది. విశాఖతో పాటు కోల్‌కతా, ముంబయి, దుర్గాపూర్, ఘజియాబాద్, నాగపుర్, రాంచీ తదితర నగరాల్లో సీబీఐ అధికారులు గురువారం సోదాలు నిర్వహించారు. ఝార్ఖండ్‌లోని లతెహర్ జిల్లాలో పవర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసే నిమిత్తం అభిజిత్ గ్రూపు కోల్‌కతా కేంద్రంగా.. కార్పొరేట్ పవర్ లిమిటెడ్ పేరుతో ఒక సంస్థ (ఎస్‌పీవీ)ని ఏర్పాటు చేసింది. దానికి 20 బ్యాంకుల కన్సార్షియం రుణం ఇచ్చింది. ఆయా బ్యాంకులను సంస్థ రూ.4,037.87 కోట్లకు మోసం చేసినట్లు ‘యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ సీబీఐకి ఫిర్యాదు చేసింది.
బ్యాంకులకు కుచ్చుటోపీ.. రూ.4,037 కోట్ల మేర మోసం చేసిన అభిజిత్ గ్రూపు సంస్థలు - cbi filed case against Abhijeet group
CBI CASE ON ABHIJEET GROUP: అభిజిత్ గ్రూపు పేరిట బ్యాంకులను రూ.4,037 కోట్లకు మోసం చేసిన కార్పొరేట్ పవర్ లిమిటెడ్ సంస్థ, డైరెక్టర్లపై సీబీఐ కేసు నమోదు చేసింది. విశాఖతో పాటు కోల్‌కతా, ముంబయి, దుర్గాపూర్, ఘజియాబాద్, నాగపుర్, రాంచీ తదితర నగరాల్లో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు.
ఈ గ్రూపునకు చెందిన పలు సంస్థలు, వాటి డైరెక్టర్లు బొగ్గు కుంభకోణం కేసుల్లో ఇప్పటికే సీబీఐ విచారణ ఎదుర్కొంటున్నారు. చితార్‌పూర్ కోల్ అండ్ పవర్ లిమిటెడ్ సంస్థ పేరునే కార్పొరేట్ పవర్ లిమిటెడ్‌గా మార్చి, ఝార్ఖండ్‌లో రూ.2,900 కోట్లతో 540 మెగావాట్ల పవర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసినట్లు, నకిలీపత్రాలతో నిధులను పక్కదారి పట్టించినట్లు సమాచారం. మనోజ్ జైశ్వాల్, అభిషేక్ జైశ్వాల్, అభిజిత్ జైశ్వాల్, రాజీవ్ కుమార్, బిషాల్ జైశ్వాల్, మున్నాకుమార్ జైశ్వాల్, కృష్ణన్, రాజీవ్ గోయల్, అరుణ్‌కుమార్ శ్రీవాస్తవ, ఎస్.ఎన్.గైక్వాడ్, ప్రేమ్‌ప్రకాశ్ శర్మ, అరుణ్ గుప్తా తదితరుల పేర్లను నిందితులుగా సీబీఐ అధికారులు ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు.
ఇవీ చదవండి: