Case of killing Hens: కృష్ణా జిల్లా మోపిదేవి మండలంలో తాను పెంచుకుంటున్న కోళ్లకు ఎవరో విషం పెట్టి చంపేశారని.. ఓ వ్యక్తి పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టారు. రెడ్రోతువారిపాలెంకు చెందిన లక్ష్మితాయారు ఇంటి వద్ద పెంచుకుంటున్న సుమారు పది కోళ్లు చనిపోయాయి. తాము తిరుపతి వెళ్లిన సమయంలో ఎవరో కావాలనే అన్నంలో విషం పెట్టి చంపేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు... కోళ్లకి పోస్టుమార్టం నిర్వహించారు. వాటి ఆధారంగా దర్యాప్తు చేస్తామని పోలీసులు అన్నారు.
కోళ్లకు పోస్ట్మార్టం, ఎందుకంటే - Variety case
Variety case కోళ్లు అన్న తర్వాత ఎక్కడో ఒకచోట ఏదో ఒకటి తిని అస్వస్థతకు గురవ్వడమో లేక మరణించడమో తరచూ చూస్తూనే ఉంటాం. అయితే ఇక్కడో వ్యక్తి మాత్రం తన కోళ్లకు విషం పెట్టి కావాలనే చంపేశారని కేసు పెట్టాడు. ఇంతవరకు బాగానే ఉన్న ఇక్కడో విచిత్రం జరిగింది. అదేంటో తెలుసుకోవాలంటే ఇది చదవండి.
HENS DEATH
Last Updated : Aug 24, 2022, 7:49 PM IST