ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

ఎవరికీ అనుమానం రాకుండా పెట్రోల్​ ట్యాంకర్​ ఎంచుకున్నారు.. కానీ..చివరికి చిక్కారు..!

పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా అక్రమార్కులు ఆగడం లేదు. ఏదో ఒక రకంగా అక్రమంగా గంజాయి, ఇతర మత్త పదార్థాలు తరలిస్తున్నారు. ఎన్ని చెక్​పోస్టులు ఏర్పాటు చేసినా.. అన్ని చోట్ల తప్పించుకుంటున్నారు. చివరకు ఎక్కడో ఒక చోట పట్టుబడుతున్నారు. తాజాగా విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం బొడ్డవరం వద్ద అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారు.

cannabis seized
cannabis seized

By

Published : Feb 6, 2022, 1:59 PM IST

పెట్రోల్ ట్యాంకర్​లో గంజాయి రవాణా.. తెలివిగా పట్టుకున్న పోలీసులు

ఎవరికీ అనుమానం రాదనే ఉద్దేశంతో గంజాయి అక్రమ రవాణాకు పెట్రోల్​ ట్యాంకర్​ను ఎంచుకున్నారు. కానీ పోలీసులు మాత్రం ఆ గంజాయిని పట్టుకున్నారు. విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం బొడ్డవరం వద్ద ఈ ఘటన జరిగింది. విశాఖ జిల్లా అరకు ప్రాంతం నుంచి వస్తున్న లారీ.. పశ్చిమ బెంగాల్‌ రిజిస్ట్రేషన్‌తో ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. చెక్‌పోస్ట్‌ తనిఖీలు చేస్తుండగా.. పోలీసులను చూసిన ఆ లారీ డ్రైవర్‌, క్లీనర్‌ అక్కడి నుంచి పారిపోయారు. అనుమానం వచ్చిన పోలీసులు.. ట్యాంకర్‌ తనిఖీ చేయగా 149 ప్యాకెట్ల గంజాయి పట్టుబడింది. ఒక్కో ప్యాకెట్‌లో సుమారు 4 నుంచి 5 కిలోల మేర ఉండొచ్చని.. మొత్తంగా 7వందల కిలోల వరకూ ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details