BTech student suicide: విద్యార్థుల ఆత్మహత్యలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా మరో విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడిన విషాద ఘటన తెలంగాణలోని గద్వాల జిల్లాలో చోటు చేసుకుంది.
ఇంటికి తిరిగి వెళ్తూ..
గద్వాలలోని నల్లకుంటకు చెందిన శ్రీవర్ష(19) హైదరాబాద్లోని సెయింట్ పీటర్స్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఇంటికి వెళ్లిన శ్రీవర్ష తిరిగి కళాశాలకు వెళ్లడానికి బుధవారం రాత్రి రైలులో బయల్దేరింది. మార్గమధ్యలో వనపర్తి జిల్లా ఆరేపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో కృష్ణానది బ్రిడ్జిపై వెళ్తున్న రైలులో నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది.