తెలంగాణలోనినిర్మల్ జిల్లా పాత మద్ధిపడగలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నవవధువు ప్రాణాలు కోల్పోయింది. పెళ్లైన కొన్నిరోజులే ఆమెకు నిండునూరేళ్లు నిండాయి. అంతసేపు ఆనందంలో మునిగితేలిన ఆ కుటుంబాల్లో ఊహించని విషాదం చోటు చేసుకుంది. పెళ్లి బాజాలతో మోర్మోగిన ఆ లోగిలి కన్నీటి సంద్రమైంది. కొత్త జీవితాన్ని ప్రారంభించకుండానే.. ఆ దంపతులను విధి విడదీసేసింది. పెళ్లి ముచ్చటైన తీరకుండానే ఆ తీపి క్షణాలను చెరిపేసింది.
ఘనంగా కూతురు పెళ్లి జరిపించి.. ఆమెను ఓ అయ్య చేతిలో పెట్టిన ఆనందం ఆ తండ్రిది. కుటుంబాన్ని విడిచి వెళ్తున్నా.. వేల కలలతో కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నాననే సంతోషం ఆ కూతురిది. వీరిద్దరి ఆనందాన్ని చూసిన ఆ దేవుడికి కన్నుకుట్టిందో ఏమో... పెళ్లి జరిగి మూడురోజులైనా గడవకముందే... ఆ తండ్రీకూతురులిద్దరినీ కానరాని లోకాలకు తీసుకెళ్లాడు.
నిర్మల్ జిల్లా కడం మండలం పాత మద్ధిపడగ గ్రామానికి చెందిన మౌనికకు మహారాష్ట్రలోని బల్లార్ష మండలం రాజురాకు చెందిన యువకుడితో ఈ నెల 25న వివాహం జరిగింది. ఈ క్రమంలో శుక్రవారం పెళ్లికొడుకు ఇంటివద్ద విందు భోజనం ముగించుకున్నారు. అందరితో సంబరంగా గడిపిన జ్ఞాపకాలను నెమరేసుకుంటూ ఆనందంగా స్వగ్రామానికి తిరుగు పయనమయ్యారు.