ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

BANK ROBBERY: బ్యాంకులో దోపిడీకి యత్నం.. కంప్యూటర్లు, హార్డ్​డిస్కులతో పరార్.. - telangana latest news

హైదరాబాద్​ గచ్చిబౌలిలోని సెంట్రల్​ బ్యాంకు బ్రాంచీలో దోపిడీకి విఫలయత్నం చేశారు. అర్ధరాత్రి రెండున్నర ప్రాంతంలో బ్యాంకు లోపలికి ప్రవేశించిన దుండగులు.. స్ట్రాంగ్​ రూంలోనికి వెళ్లేందుకు యత్నించారు. సాధ్యం కాకపోవడంతో కంప్యూటర్లు, హార్డ్​ డిస్కులు, ఇతర సామగ్రిని అపహరించారు.

BANK ROBBERY
BANK ROBBERY

By

Published : Sep 9, 2021, 1:26 PM IST

హైదరాబాద్​ గచ్చిబౌలిలో దొంగలు రెచ్చిపోయారు. సైబరాబాద్​ పోలీస్​ కమిషనరేట్​ పక్కనే.. ప్రధాన రహదారి మీద ఉన్న సెంట్రల్ బ్యాంకు బ్రాంచీలో దోపిడీకి విఫలయత్నం చేశారు. అర్ధరాత్రి రెండున్నర ప్రాంతంలో బ్యాంకు కిటికీ గ్రిల్​ తొలగించి బ్యాంకు లోపలికి ప్రవేశించిన దుండగులు.. సీసీ కెమెరాల వైర్లు కట్​చేసి.. స్ట్రాంగ్​ రూమ్ తలుపులు తెరిచేందుకు యత్నించారు. ఫాల్​ సీలింగ్ కూల్చి స్ట్రాంగ్​ రూంలోనికి వెళ్లేందుకు యత్నించినా.. సాధ్యం కాకపోవడం వల్ల బ్యాంకులోని కంప్యూటర్లు, హార్డ్​ డిస్కులు, ఇతర సామగ్రిని ఓ ఆటోలో సర్దుకొని పరారయ్యారు.

BANK ROBBERY: బ్యాంకులో దోపిడీకి యత్నం.. కంప్యూటర్లు, హార్డ్​డిస్కులతో పరార్..

దాదాపు 3 గంటల పాటు వారి దోపిడీ యత్నం కొనసాగగా.. ఉదయం 5 గంటల ప్రాంతంలో బ్యాంకు నుంచి పారిపోయినట్లు బ్యాంకు బయట ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో నమోదైంది. ఉదయం బ్యాంకు తెరిచిన సిబ్బంది విషయం గమనించి పోలీసులకు సమాచారం అందించారు. రాయదుర్గం పోలీసులు క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్​లను రప్పించి ఆధారాలు సేకరించారు. ఓ పురుషుడు, ఓ మహిళ ఈ చోరీకి పాల్పడి ఉంటారని.. మరికొందరు వారికి సహకరించి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.

ఇదీ చూడండి:Rice pulling Fraud: తాను మునిగాడు.. అందర్నీ ముంచుతున్నాడు

ABOUT THE AUTHOR

...view details