ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

నెల్లూరులో దారుణం.. యువతిపై యువకుడు కత్తితో దాడి - యువతిపై కత్తితో విచక్షణారహితంగా దాడి

Attack On Young Woman In Nellore : నెల్లూరులో దారుణం జరిగింది. జిల్లాలోని రాజుపాలెం వద్ద యువతిపై ఓ యువకుడు విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ ఘటనలో యువతికి తీవ్రగాయాలయ్యాయి.

Attack On Young Woman In Nellore
Attack On Young Woman In Nellore

By

Published : Oct 20, 2022, 5:05 PM IST

Updated : Oct 20, 2022, 7:22 PM IST

Attack On Young Woman : నెల్లూరులో జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కొడవలూరు మండలం రాజుపాలెం వద్ద మానేగుంటపాడుకు చెందిన చెంచులక్ష్మి అనే యువతిపై కోవూరు మండలం లేగుంటపాడుకు చెందిన సురేష్ అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు. కోవూరు నుంచి ఆటోలో వెళ్తుండగా వెంబడించిన సురేష్.. రాజుపాలెం సమీపంలో ఆటోలో నుంచి బయటకు లాగి కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. యువతి కేకలు వేయడంతో అక్కడి నుంచి సురేష్ పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన చెంచులక్ష్మిని స్థానికులు నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

లేగుంటపాడు ప్రభుత్వ ఆసుపత్రిలో చెంచులక్ష్మి విధులను నిర్వహిస్తున్న సమయంలో.. ఆటో డ్రైవర్​ సురేష్​తో పరిచయమైంది. ఆ తర్వాత అది కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. కొంతకాలం నుంచి సురేష్​ను చెంచులక్ష్మి దూరం పెట్టడంతో.. కక్ష పెంచుకున్న కత్తితో దాడికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న కొడవలూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.

నెల్లూరులో దారుణం.. యువతిపై యువకుడు కత్తితో దాడి

ఇవీ చదవండి:

Last Updated : Oct 20, 2022, 7:22 PM IST

ABOUT THE AUTHOR

...view details