Tollywood Drugs case : ఈడీ విచారణకు హాజరైన నటుడు నందు
10:38 September 07
Money laundering case
టాలీవుడ్ డ్రగ్స్ కేసు (Tollywood Drugs case)లో ఈడీ అధికారులు విచారణ ముమ్మరం చేశారు. ఈ కేసులో ఇప్పటికే దర్శకుడు పూరీ జగన్నాథ్, నటి, నిర్మాత ఛార్మి, నటి రకుల్ ప్రీత్ సింగ్లను విచారించారు.
నటుడు నందు ఇవాళ ఈడీ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. మనీలాండరింగ్ కేసు (Tollywood Drugs case)లో నందుకు ఈడీ నోటీసులు జారీ చేసింది. షెడ్యూల్ ప్రకారం ఈనెల 20న నందు విచారణకు హాజరుకావాల్సి ఉంది. కానీ.. షూటింగ్ వల్ల ముందుగా విచారించాలని నందు అధికారులను కోరగా.. వారు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. నందు బ్యాంక్ ఖాతాలు, అనుమానాస్పద లావాదేవీల గురించి ఈడీ ఆరా తీసే అవకాశం ఉందని సమాచారం.