కృష్ణాజిల్లా నందిగామ వద్ద జాతీయ రహదారిపై లారీ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్ లారీ నుంచి కిందకు దూకేసిన ప్రమాదం నుంచి బయటపడ్డాడు. కానీ అంతలోనే డీసీఎం రూపంలో మృత్యువు దూసుకొచ్చింది. పక్కన నిల్చుని ప్రమాదం జరిగిన తీరుని పరిశీలిస్తుండగా డీసీఎం వచ్చి లారీని ఢీ కొనడంతో లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదంలో మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. రెండు వాహనాల మధ్యలో చిక్కుకున్న డ్రైవర్ మృతదేహాన్ని బయటకు తీశారు. రహదారిపై భారీగా మట్టి కుప్పలు ఉండటంతో లారీ బోల్తా పడిన విషయాన్ని డీసీఎం డ్రైవర్ గమనించక పోవడంతో ప్రమాదం జరిగినట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న నందిగామ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అదుపు తప్పి లారీ బోల్తా.. అంతలోనే ముంచుకొచ్చిన మృత్యువు - నందిగామ వద్ద రోడ్డు ప్రమాదం
ప్రమాదవశాత్తు లారీ బోల్తా పడింది. బతుకు జీవుడా అన్నట్లు లారీ డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డాడు. కానీ మరో రూపంలో మృత్యువు అతన్ని బలికొంది. ఈ హృదయ విదారక సంఘటన కృష్ణాజిల్లా నందిగామ వద్ద జాతీయ రహదారిపై జరిగింది.
లారీ డ్రైవర్ మృతి