accident at kurnool: కర్నూల్ జిల్లా మంత్రాలయం పీఎస్ పరిధిలోని కల్లుదెవకుంట గ్రామం సమీపంలో తెల్లవారుజామున ప్రమాదం జరిగింది. బెంగళూరు నుంచి మంత్రాలయం వస్తున్న కారు అదుపు తప్పడంతో ప్రమాదం జరిగింది.ఈ కారులో శారద (53)తో పాటు, మరో నలుగురు కలిసి రాఘవేంద్ర స్వామి దర్శనానికి వెళ్తుండగా డ్రైవర్ నిద్ర మత్తు, అతివేగం వల్ల కల్లుదెవకుంట సమీపంలో కల్వర్టుకు ఢీ కొంది. ఈ ఘటనలో శారద తలకు గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందిది. కారులోని ఎయిర్ బ్యాగ్ ఓపెన్ కావడంతో మిగిలిన నలుగురు సురక్షింతంగా బయటపడ్డారు. మృతురాలు శారద బెంగళూరు వాసిగా పోలీసులు గుర్తించారు.
accident: కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి - కర్నూలు జిల్లా తాజా వార్తలు
kurnool accident: కర్నూల్ జిల్లా మంత్రాలయం పీఎస్ పరిధిలో తెల్లవారుజామున ప్రమాదం జరిగింది. బెంగళూరు నుంచి మంత్రాలయం వస్తున్న కారు అదుపు తప్పడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక మహిళ మృతి చెందింది.
కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదం