ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

కడపలో యువకుడు దారుణహత్య.. పాతకక్షలేనా..! - కడపలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు

A Man Murder : కడపలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. అలాగే మరో యువకుడు తీవ్ర గాయాల పాలయ్యాడు. కాగా అతన్ని ఆస్పత్రికి తరలించారు. హత్యకు పాత గొడవలే కారణమని పోలీసులు తెలిపారు.

Murder
హత్య

By

Published : Feb 1, 2023, 10:39 PM IST

A Man Murder: కడప నగర నడిబొడ్డున సాయిబాబా థియేటర్ సమీపంలోని రఘు వైన్స్ ఆవరణలో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన యువకుడిని హుటాహుటిన ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తరలించారు. కడప రాజారెడ్డి వీధికి చెందిన రేవంత్ జులాయిగా తిరిగేవాడు. గతంలో అతనిపై పలు కేసులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి రఘు వైన్స్​లో మద్యం తాగేందుకు రేవంత్ వచ్చాడు.

అతని కోసం కాపు కాచిన ప్రత్యర్థులు అతనిని కత్తితో విచక్షణారహితంగా పొడిచారు. అడ్డు వచ్చిన రేవంత్ స్నేహితుడు అభిలాష్​ను కూడా కత్తితో పొడవడంతో అతనికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన అభిలాష్​ను ప్రభుత్వ సరోజన ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ఒకటో పట్టణ పోలీసులు, కడప డీఎస్పీ వెంకట శివారెడ్డి ఘటన స్థలాన్ని పరిశీలించారు. పాత గొడవలే హత్యకు కారణమని పోలీసులు ధృవీకరించారు. ముద్దాయిల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details