Teacher Misbehaving With Female Students: ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థినుల పట్ల ఉపాధ్యాయుడు అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని.. విద్యార్థిని, విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టిన సంఘటన సత్యసాయి జిల్లా హిందూపురంలో చోటు చేసుకుంది. హిందూపురం మండలం మనేసముద్రం గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో సామాన్య శాస్త్రాన్ని బోధించే ఉపాధ్యాయుడు విద్యార్థుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని ఆరోపిస్తూ విద్యార్థి సంఘాల మద్దతుతో విద్యార్థినిలు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు.
ఉపాధ్యాయుడు అసభ్య ప్రవర్తన.. రోడ్డుపై విద్యార్థుల ఆందోళన - AP Latest News
Teacher Misbehaving With Female Students: చదువు చెప్పే ఉపాధ్యాయుడే విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. విషయం తెలుసుకున్న తోటి విద్యార్థులు విద్యార్థినులతో కలిసి రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. కీచక ఉపాధ్యాయుడిని వెంటనే విధుల నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు.
హిందూపురం నుంచి అనంతపురం వెళ్లే ప్రధాన రహదారిపై బైఠాయించడంతో.. కాసేపు వాహనాల రాకపోకల నిలిచిపోయాయి. కీచక ఉపాధ్యాయుడిని వెంటనే విధుల నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. ఆరోపణలకు గురైన ఉపాధ్యాయుడు రెండు రోజులుగా పాఠశాలకు రావడంలేదని.. తప్పు చేయనివాడైతే ఎందుకు సెలవుపై వెళ్లాడని ప్రశ్నించారు. విషయం తెలుసుకున్న హిందూపురం రూరల్ పోలీసులు విద్యార్థులతో చర్చించారు. ఉపాధ్యాయుడిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
ఇవీ చదవండి:
TAGGED:
హిందూపురం