ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

అమ్మాయిల కిడ్నాప్‌కు యత్నం.. చితక్కొట్టిన స్థానికులు - kidnap news

అమ్మాయిల కిడ్నాప్‌కు ప్రయత్నించిన ఓ వ్యక్తిని స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేశారు. స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో అప్పగించారు. ఈ ఘటన తెలంగాణ చంద్రాయణగుట్ట సమీపంలో చోటుచేసుకుంది.

KIDNAP
KIDNAP

By

Published : Feb 23, 2021, 2:23 PM IST

తెలంగాణలో.. ఇద్దరు అమ్మాయిల కిడ్నాప్‌కు ప్రయత్నించిన ఓ వ్యక్తిని స్థానికులు పట్టుకుని చంద్రాయణగుట్ట పోలీసులకు అప్పగించారు. మైలార్​దేవ్​పల్లికి చెందిన మొహమ్మది బేగం(10), మైమున (6) ఇంటి వద్ద ఆడుకుంటుండగా.. గుర్తు తెలియని వ్యక్తి కిడ్నాప్‌ చేశాడు. వారిని బండ్లగూడలోని సవేరా హోటల్ వద్దకు తీసుకెళ్లి నల్లటి మాత్రలు వేయడానికి ప్రయత్నించాడు.

పిల్లలు అరవటంతో దారిగుండా వెళ్తున్న స్థానికులు గమనించి ఆ వ్యక్తికి దేహశుద్ధి చేశారు. చంద్రాయణగుట్ట పోలీస్‌ స్టేషన్‌కు సమాచారం అందించారు. నిందితున్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కిడ్నాప్‌కు ప్రయత్నించిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని బాలికల తల్లి కోరారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి:విద్యుత్‌ తీగలు తెగిపడి తల్లీకుమారుడు సజీవదహనం

ABOUT THE AUTHOR

...view details