కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి కామాంధుడయ్యాడు. కూతురిపైనే అత్యాచారం చేశాడు. వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ ఇంటికి కన్నకూతురిని తీసుకెళ్లి.. బాలికకు బలవంతంగా మద్యం తాగించి మత్తులో ఉండగా 2రోజులపాటు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. దాన్ని వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ వీడియో తీయడం పైశాచికత్వానికి పరాకాష్టగా నిలిచింది.
MINOR GIRL RAPED: మద్య మత్తులో కన్న కూతురిపైనే దారుణం.. - prakasam district crime news
రాష్ట్రంలో రోజు రోజుకు మహిళలు, బాలికలపై దారుణాలు పెరిగిపోతున్నాయి. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా.. ఎంతమందిని అరెస్టు చేసినా ఈ దారుణ ఘటనలు ఆగడం లేదు. పసి పిల్లల నుంచి వృద్ధుల వరకు ఎవరినీ వదలకుండా అత్యాచారాలకు పాల్పడుతున్నారు. మద్యం మత్తులో కన్న కూతురిపైనే అత్యాచారానికి పాల్పడ్డాడో వ్యక్తి. కడప జిల్లాలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రాగా ప్రకాశం జిల్లా పోలీసులు కేసు నమోదు చేశారు.
ప్రకాశం జిల్లా మార్కాపురంలో చోటు చేసుకున్న ఈ సంఘటన సభ్య సమాజానికి తలవంపుగా నిలిచింది. వివరాలను డీఎస్పీ కిశోర్‌కుమార్ విలేకరులకు ఆదివారం తెలిపారు. మార్కాపురంలో నివసించే వ్యక్తి కడప జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. తాను పనిచేస్తున్న ప్రాంతంలో ఓ మహిళతో వివాహేతర సంబంధమేర్పడింది. గత జులై రెండో వారంలో తన 15ఏళ్ల కుమార్తెను మార్కాపురం నుంచి అక్కడికి తీసుకెళ్లాడు. అక్కడ సదరు మహిళతో కలిసి బాలికకు బలవంతంగా మద్యం తాగించి అత్యాచారం చేశాడు. దాన్ని మహిళ ఫోన్‌లో చిత్రీకరించింది. విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని అతడు బెదిరించడంతో బాలిక భయపడిపోయింది. అనంతరం ఆమెను ప్రకాశం జిల్లాలో మరో చోట తాను వివాహేతర సంబంధం పెట్టుకున్న ఇంకో మహిళ ఇంటికి కూడా తీసుకెళ్లాడు. నెలన్నరపాటు అక్కడే ఉంచాడు. సొంత భార్యకు మాత్రం కుమార్తె తన వద్దే ఉందంటూ మభ్యపెడుతూ ఫోన్‌లో మాట్లాడించేవాడు. సెప్టెంబరు రెండో వారంలో ఓ బంధువు చనిపోతే కార్యక్రమానికి కూతురితో కలిసి తండ్రి వచ్చాడు. అక్కడ బాలిక ప్రవర్తనలో మార్పులు గమనించిన తల్లి ఆరా తీసి వివరాలు తెలుసుకున్నారు. భర్త వివాహేతర సంబంధాలు పెచ్చుమీరుతున్నాయని గుర్తించిన ఆమె చివరకు కూతురిపై అత్యాచారం గురించి గత సెప్టెంబరు 25న పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు.
ఇదీ చదవండి..:Land Scam: నకిలీ పత్రాలతో ప్రభుత్వ భూముల కబ్జా.. పోలీసుల అదుపులో నిందితులు