ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

ప్రకాశం జిల్లాలో దారుణం.. గొంతు కోసి రైతును చంపేశారు! - ప్రకాశం జిల్లా నేర వార్తలు

Farmer Brutal Murder in Prakasam District: పొలంలో పని చేసుకుంటున్న ఓ రైతును గొంతు కోసి హత్య చేశారు గుర్తుతెలియని వ్యక్తులు. ఈ దారుణ ఘటన ప్రకాశం జిల్లా చిన్నఓబినేనిపల్లిలో చోటుచేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నారు.

farmer Srinath reddy murdered at prakasam district
ప్రకాశం జిల్లాలో రైతు దారణం హత్య

By

Published : Mar 2, 2022, 8:36 PM IST

Prakash District Crime News: ప్రకాశం జిల్లా బెస్తవారిపేట మండలం చిన్న ఓబినేనిపల్లి గ్రామంలో దారుణం జరిగింది. ఓ రైతు.. తన పొలంలో పని చేస్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు గొంతుకోసి హత్య చేశారు. గ్రామానికి చెందిన శ్రీనాథ్ రెడ్డి.. తన పొలంలోని మొక్కజొన్న పంటకు నీళ్లు పెట్టేందుకు వెళ్లాడు. పొలంలో ఏం జరిగిందో తెలియదు కానీ గుర్తుతెలియని వ్యక్తులు శ్రీనాథ్ రెడ్డి గొంతుకోసి పడేసి వెళ్లారు. పొలంలో శ్రీనాథ్​ రెడ్డి మృతదేహాన్ని చూసిన స్థానికులు.. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.

సీఐ ఫిరోజ్, బేస్తవారిపేట ఎస్సై మాధవరావు.. ఘటనా స్థలానికి చేరుకొని హత్య తీరును పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు. ఈ కేసులో నిందితులు ఎంతటి వారైనా శిక్షపడేలా చేస్తామని సీఐ ఫిరోజ్ అన్నారు. మృతుడు శ్రీనాథ్ రెడ్డికి ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. అతనికి ఇద్దరు కుమార్తెలు.. ఒక కుమారుడు ఉన్నారు. కుటుంబ పెద్ద మరణంతో ఆ కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details