శ్రీకాకుళం జిల్లా కొండగూడెం గ్రామంలో రెడ్డి దుర్గాప్రసాద్(14) అనే తొమ్మిదో తరగతి విద్యార్థి దారుణంగా హత్యకు గురయ్యాడు. గ్రామం మధ్యలో అందరూ చూస్తుండగా నిందితుడు హత్య చేశాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. దుర్గాప్రసాద్ గ్రంథాలయ సమీపంలో ఉన్న పాల కేంద్రంలో పాలు పోసి వస్తున్నాడు. తిరిగి వస్తుండగా అదే గ్రామానికి చెందిన కొండపల్లి గోవిందరావు(45) వెనక నుంచి వచ్చి తలపైన, మెడ పైన విచక్షణారహితంగా దాడి చేశాడు. దుర్గాప్రసాద్ చనిపోయాడని నిర్ధారించుకుని.. గోవిందరావు పరారయ్యాడు. ఇదంతా స్థానికులు చూసినట్లు పోలీసులు తెలిపారు. సంఘటన స్థలానికి రాజాం రూరల్ సీఐ నవీన్ కుమార్, సంతకవిటి ఎస్ఐ రామారావు చేరుకొని విచారణ చేపట్టారు. హత్యకు ఉపయోగించిన మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు. నాలుగు బృందాలుగా నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు చెబుతున్నారు.
అందరూ చూస్తుండగానే.. గ్రామం మధ్యలో విద్యార్థి హత్య..! - శ్రీకాకుళంలో తొమ్మిదొ తరగతి విద్యార్థి హత్య వార్తలు
శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం కొండగూడెం గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. అందరూ చూస్తుండగానే గ్రామం నడిమధ్యన తొమ్మిదో తరగతి విద్యార్థిని ఓ వ్యక్తి హత్య చేశాడు.
9th class student murdered in srikakulam