కృష్ణా జిల్లా గన్నవరం శివారులో చెన్నై-కోల్ కతా జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయంలో ఆదివారం అర్ధరాత్రి చోరీ జరిగింది. సుమారు 11 నుంచి 11:30 గంటల మధ్యలో ఆలయంలోకి చొరబడిన దుండగులు... రాడ్లతో హుండీలు, తాళాలు పగులకొట్టి బంగారం ఆభరణాలు, నగదు ఎత్తుకెళ్లారు. సుమారు 10 కాసులు బంగారం, 16 కిలోల వెండి, 20 కిలోల రాగితో పాటు హుండీలో ఉన్న నగదును కూడా దోచుకెళ్లినట్లు పోలీసులు చెబుుతన్నారు.
THEFT IN TEMPLE: శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయంలో చోరీ.. 10 కాసుల బంగారం, 16 కిలోల వెండి స్వాహా..!
కృష్ణా జిల్లా గన్నవరం శివారులో ఉన్న శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయంలో ఆదివారం అర్ధరాత్రి చోరీ జరిగింది. దాదాపు 10 కాసుల బంగారం, 16 కిలోల వెండి, 20 కిలోల రాగితోపాటు హుండీలో ఉన్న నగదును కూడా దోచుకెళ్లారు.
శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయంలో చోరీ
సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను పట్టుకొనేందుకు చర్యలు చేపట్టినట్లు స్థానిక ఎస్సై ఫ్రాన్సిస్ పేర్కొన్నారు. ఆంజనేయ స్వామి విగ్రహంపై ఉన్న ఆభరణాలును కూడా దోచుకెళ్లినట్లు ఆలయ అర్చకులు తెలిపారు.
ఇదీ చూడండి: HUGE THEFT IN VISAKHA PATNAM : విశాఖలో భారీ చోరీ.. బంగారం, వెండి, నగదు మాయం