శ్రీకాకుళం జిల్లా కొత్తూరు-పారాపురానికి చెందిన కిలుగు మన్మథరావు అనే వ్యక్తి రావులపాలెం వెళ్తుండగా... బస్సు విశాఖ బస్టాండ్లోఆగింది.మూత్రశాలకు వెళ్లేందుకు దిగాడు. ఆ సమయంలోనే ఓ ఇద్దరు ప్రయాణికులు బహిరంగంగానే మూత్రవిసర్జన చేశారు. అది చూసిన ఇతనూ అదే పని చేయబోయాడు. అక్కడే ఉన్న ఇద్దరు కానిస్టేబుళ్లు తనను ఆపారని... జేబులో ఉన్న నగదు తీసుకొని అందరి ముందు కొట్టారని మన్మథరావు ఆరోపించాడు. ఈ ఘటనతో తీవ్రమనస్తాపానికి గురై బ్లేడ్‌తో గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తీవ్రరక్త స్రావంతో ఉన్న మన్మథరావును హుటాహుటిన కేజీహెచ్‌కి తరలించారు. అత్యవసరవార్డులో ఆయనకు చికిత్స అందిస్తున్నారు.
ఆ పని చేయొద్దన్నందుకు గొంతు కోసుకున్న వ్యక్తి - Man suicide attempt in vizag bus stand
బహిరంగ మూత్రవిసర్జన చేస్తున్న తనను పట్టుకొని పోలీసులు వేధించారని ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. దౌర్జన్యంగా వ్యవహరించి తన వద్ద నగదు తీసుకున్నారని ఆరోపించాడు.
పోలీసులు కొట్టారని గొంతు కోసుకుని వ్యక్తి ఆత్మహత్యయత్నం
Last Updated : Oct 22, 2019, 1:19 AM IST