ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మద్యం దుకాణాలు తెరవటంపై మహిళాగ్రహం - Women shut down liquor stores across the state

కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ మద్యం దుకాణాలు తెరవడంపై మహిళలు భగ్గుమంటున్నారు. దుకాణాలు మూసివేయాలంటూ పలుచోట్ల వేడుకున్నారు. లాక్‌డౌన్‌ ప్రభావంతో పనుల్లేక ఇళ్లకేపరిమితమైన వాళ్లు ఇప్పుడు తాగుడు కోసం తాళిబొట్లు, ఇంట్లో వస్తువులు తాకట్టు పెట్టే పరిస్థితి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Women shut down liquor stores across the state
రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాలు మూసేయాలంటూ మహిళలు ధర్నా

By

Published : May 6, 2020, 7:43 AM IST

కరోనా కష్టకాలంలోనూ ప్రభుత్వానికి మద్యం దుకాణాలే ముఖ్యమయ్యాయా అంటూ మహిళలు మండిపడ్డారు. వాటిని మూసేయాలంటూ రాష్ట్రంలో వివిధ చోట్ల నిరసనలు చేపట్టారు. విశాఖ నగరంలో మద్యం దుకాణాలు మూసేయాలంటూ తెలుగుదేశం మహిళా కార్యకర్తలు దుకాణాల ముందు బారులు తీరిన మందుబాబులు, పోలీసులకు దండం పెడుతూ వేడుకున్నారు. మద్యం అమ్మకాలు ఆపాలంటూ ఆరిలోవ తోటగరువులోని దుకాణం వద్ద మహిళలు ధర్నా చేశారు.

పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో మారుతీనగర్‌లో ఉన్న దుకాణాన్ని తొలగించాలంటూ మహిళలు ఆందోళన చేశారు. నివాసాల మధ్య ఉండటంతో మహిళలు, యువతులపై ఆకతాయిల వేధింపులు ఎక్కువవుతున్నాయన్నారు.

మద్యం దుకాణాల వద్ద లాక్‌డౌన్‌ నిబంధనలు ఏమయ్యాయని మహిళలు ప్రశ్నిస్తున్నారు. వాటికి తక్షణమే తాళం వేయాలంటూ నెల్లూరు జిల్లాలో పలుచోట్ల ధర్నాలు చేశారు.

ఇవీ చదవండి...'మద్యం దుకాణాలు సరే.. మరి బుక్​ షాపుల మాటేంటి..?'

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details