నిన్న ఆమంచి... నేడు అవంతి! - mp
ఆమంచి దారిలోనే మరో నేత తెదేపాను వీడనున్నారు. భీమిలి అసెంబ్లీ స్థానంపై హామీ ఇవ్వలేదని.. అధిష్ఠానంపై అలకబూనిన అవంతి శ్రీనివాస్ నేడు జగన్ తో భేటీ కానున్నారు.
అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్(ముత్తంశెట్టి శ్రీనివాస్) తెలుగుదేశం పార్టీని వీడతారని ప్రచారం జరుగుతోంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో భీమిలి లేదా విశాఖ ఉత్తరం అసెంబ్లీ స్థానం చేయాలని అవంతి కోరుతున్నారు. దీనిపై తెదేపా అధిష్ఠానం మాత్రం హామీ ఇవ్వడానికి నిరాకరించంది. అప్పటి నుంచి పార్టీపై అలకబూనిన శ్రీనివాస్... వైకాపా ఆశ్రయించారు. భీమిలి టికెట్ ఇచ్చేందుకు ప్రతిపక్ష పార్టీ అంగీకరించినట్లు సమాచారం. తెదేపా నేతలకు అవంతి అందుబాటులో లేకపోవడం... పార్టీ వీడుతున్నారన్న ప్రచారానికి మరింత బలం చేకూరుస్తుంది.
నేడు జగన్ తో భేటీ
మధ్యాహ్నం 2 గంటలకు అవంతి నివాసానికి వైకాపా నేతలు వెళ్లి పార్టీలోకి ఆహ్వానించునున్నారు. సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో జగన్ తో ఎంపీ భేటీ కానున్నారు.