విశాఖపట్నం కేజీహెచ్‌లో తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. ముఖ్యంగా గైనిక్ వార్డులో నీళ్లు లేక శస్త్ర చికిత్సలు కూడా ఆగిపోతున్నాయి. వార్డులో ఉంటున్న బాలింతలు, గర్భిణులు కనీస అవసరాలకు నీళ్లు దొరక్క తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత మూడు రోజులుగా ఇదే పరిస్థితి నెలకొందని వారి బంధువులు, గర్భిణులు వాపోయారు. నీళ్లు లేక మరుగుదొడ్లకు కూడా వెళ్లలేక పోతున్నామని.. మంచినీళ్లు డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆపరేషన్ థియేటర్‌కు తీసుకువెళ్లి నీళ్లు లేవని వెనక్కి పంపించారని రోగుల బంధువులు చెబుతున్నారు.
WATER PROBLEM IN KGH: పేరుకు పెద్దాసుపత్రి..నీళ్లకు కటకట..కేజీహెచ్‌లో దుస్థితి - కేజీహెచ్ తాజా వార్తలు
పేరుకు మాత్రమే పెద్దాసుపత్రి.. అందులో అడుగడుగునా సమస్యలే. విశాఖపట్నంలోని కేజీహెచ్‌లో వైద్యం ఏమో కానీ కనీసం వాడుకోవడానికి నీరు కూడా దొరకని పరిస్థితి నెలకొంది. మరుగుదొడ్డికి వెళ్లాలన్నా మినరల్ వాటర్ కొనుక్కుని వెళ్లాల్సిన విచిత్ర పరిస్థితి దాపురించింది. అధికారులు మాత్రం ఏ మాత్రం పట్టనట్లు వ్యవహరిస్తున్నారు.
water problem in kgh vishakha
కొద్దిపాటి నీటితో ట్యాంకర్ రాగా.. వాటి కోసం ఎగబడాల్సిన పరిస్థితి ఉంది. నీటి బిందెలు మోస్తున్న వారిలో బాలింతలు కూడా ఉంటున్నారు.
ఇదీ చదవండి:AP RAINS LIVE UPDATES : రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు.. రోడ్లన్నీజలమయం