విశాఖ సిరిపురంలోని వీఎంఆర్‌డీఏ లీజుకు ఇచ్చిన స్థలంలో ఫ్యూజన్ ఫుడ్స్ యజమాని నిర్వహిస్తున్నహోటల్‌ను అధికారులు ఆదివారం ఖాళీ చేయించారు. తెల్లవారుజాము 3గంటల నుంచి ఈ ప్రక్రియ కొనసాగింది. పోలీసు బందోబస్తు నడుమ వీఎంఆర్‌డీఏ అధికారులు సిబ్బంది సాయంతో హోటల్‌లోని సామగ్రిని బయటకు తీసుకొచ్చి లారీల్లో తరలించారు. లీజు కొనసాగింపు విధానం సక్రమంగా లేకపోవడం, సంస్థ ఆదాయానికి భారీగా గండిపడటంతో లీజు రద్దు చేసి హోటల్ ఖాళీ చేయించినట్టు అధికారులు వెల్లడించారు.
ముందస్తు సమాచారం లేకుండా అర్థరాత్రి వచ్చి సామాగ్రిని ధ్వంసం చేసి ఖాళీ చేయించారని హోటల్ యజమాని హర్షవర్దన్ ఆరోపించారు. హోటల్ తాళాలు పగులకొట్టి, సెక్యూరిటీ సిబ్బందిని నిర్బంధించి లోపలున్న సామగ్రిని బయటపడేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వీఎంఆర్‌డీఏ నుంచి స్థలం లీజుకు తీసుకుని రూ.5కోట్లు పెట్టుబడితో హోటల్ నిర్మించామన్నారు. 2024 వరకు లీజు గడువు ఉన్నప్పటికీ ముందస్తు నోటీసులు లేకుండా అర్థరాత్రి వచ్చి ఖాళీ చేయించడం సరికాదని, బతిమాలినా అధికారులు కనికరించలేదని హర్షవర్దన్ అవేదన వ్యక్తం చేశారు.
తెదేపానేతల సంఘీభావం