విశాఖ పోర్టు రోడ్డులో దారి దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. దోపిడీ జరిగిందని బాధితుడు శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రూ.20 లక్షలు అపహరించారనే పోలీసులు కేసు నమోదు చేశారు. కేసును ఛేదించే పనిలో పోలీసులే అవాక్కాయ్యారు. బాధితుడు శ్రీనివాస్ నిందితుడిగా గుర్తించారు. ప్రైవేటు ట్రాన్స్ పోర్టు కంపెనీలో శ్రీనివాస్ పని చేస్తున్నాడు. సంస్థకు చెందిన రూ.20 లక్షలు కాజేయాలని ప్లాన్ వేశాడు. స్వయంగా బ్లేడుతో గాయపరుచుకుని ఎవరో..దోపిడీ చేసినట్లుగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. పొంతనలోని సమాధానాలు చెప్పడంతో అనుమాన పడిన పోలీసులు అసలు విషయం రాబట్టారు. నిందితుడు శ్రీనివాస్ నుంచి రూ.20 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు సీపీ ఆర్.కె.మీనా తెలిపారు.
20 లక్షల దారి దోపిడీ కేసులో బాధితుడే నిందితుడు!
గాజువాక పోర్టు రోడ్డులో ఈ నెల 7న భారీ చోరీ జరిగింది. బ్యాంకులో డబ్బు జమ చేసేందుకు వెళ్తోన్న ఓ వ్యక్తిని దుండగులు అడ్డగించి నగదుతో ఉడాయించారు. ఈ కేసును పోలీసులు ఛేదించారు. బాధితుడే నిందితుడని తెలిసి అవాక్కాయ్యారు.
vishaka_port_robbery_case_solved
Last Updated : Aug 10, 2019, 12:51 PM IST