ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

నేవల్ డాక్​ యార్డ్​ ప్రేరణ స్థల్.. సిబ్బందికి అంకితం

విశాఖ నేవల్ డాక్ యార్డ్​లోని ప్రేరణ స్థల్​ను తూర్పు నౌకదళ ప్రధానాధికారి వైస్ అడ్మిరల్ అతుల్ కుమార్ జైన్ సిబ్బందికి అంకితం చేశారు. ఆత్మ నిర్భర్ భారత్​లో భాగంగా ప్రేరణ స్థల్ ఏర్పాటు చేశారు. మార్చి 2021 నుంచి ప్రారంభమయ్యే నేవల్ డాక్ యార్డు స్వర్ణోత్సవ సంబరాలకు ప్రేరణ్ స్థల్​తో నాందిపలికారు.

preranshtal
preranshtal

By

Published : Nov 12, 2020, 6:18 PM IST

విశాఖలోని నేవల్ డాక్ యార్డ్​లో ప్రేరణ స్థల్​ను తూర్పు నౌకాదళ ప్రధానాధికారి వైస్ అడ్మిరల్ అతుల్ కుమార్ జైన్ సిబ్బందికి అంకితం చేశారు. ఆత్మనిర్భర్ భారత్​లో భాగంగా స్వయంసమృద్ధికి చిహ్నంగా ఈ ప్రేరణ స్థల్​ను నావెల్ డాక్ యార్డులో ఏర్పాటు చేశారు. దేశీయంగానే యుద్ధ నౌకలు, జలాంతర్గాముల మరమ్మతులు, రీఫిట్ చేసే పనిని నేవల్ డాక్ యార్డులోనే నిర్వహించే సామర్థ్యం సాధించగలిగింది.

ప్రేరణ స్థల్​లో 30.5 మీటర్ల జాతీయ జెండ్ పోల్​ను ఏర్పాటు చేశారు. ఈ పోల్​పై 20x30 అడుగుల జాతీయ జెండాను ఎగుర వేశారు. మార్చి 2021 నుంచి ఆరంభం కానున్న నేవల్ డాక్ యార్డు స్వర్ణోత్సవ సంబరాలకు ప్రేరణ్ స్థల్​తో నాందిపలికారు.

ABOUT THE AUTHOR

...view details