హైకోర్టు ఆదేశాలతో వైద్యుడు సుధాకర్ కేసును సీబీఐకి అప్పగించామని విశాఖ పోలీసు కమిషనర్ ఆర్కే మీనా తెలిపారు. కేసుకు సంబంధించిన అన్ని ఆధారాలు సీబీఐకి అందించామని తెలిపారు. డాక్టర్ సుధాకర్ కేసులో పోలీసులు ఎటువంటి విచారణ చేపట్టడంలేదని స్పష్టం చేశారు. అయినా డా.సుధాకర్ స్థానిక పోలీసు స్టేషన్‌కి రావటంపై ఆర్కే మీనా అసహనం వ్యక్తం చేశారు.
డా.సుధాకర్ వ్యవహారంపై సీబీఐకి లేఖ రాస్తాం: ఆర్కే మీనా
వైద్యుడు సుధాకర్ స్థానిక పోలీసు స్టేషన్‌కు రావటంపై విశాఖ సీపీ ఆర్కే మీనా అసహనం వ్యక్తం చేశారు. సుధాకర్ కేసును హైకోర్టు ఆదేశాలతో సీబీఐకి అప్పగించామన్నారు. కేసుతో పోలీసులకు ఎటువంటి సంబంధంలేదన్నారు. విచారణ మొత్తం సీబీఐ చేస్తుందని చెప్పారు. కొందరు రాజకీయ నేతలతో కలిసి డా.సుధాకర్ పోలీసు స్టేషన్ రావటంపై ఆర్కే మీనా అభ్యంతరం తెలిపారు. ఈ వ్యవహారంపై సీబీఐకి లేఖ రాస్తామని స్పష్టం చేశారు.
విశాఖ సీపీ ఆర్కే మీనా
ఈ అంశంపై సీబీఐకి లేఖ రాస్తామని మీనా చెప్పారు. కేసు సీబీఐ పరిధిలో ఉండగా ఎటువంటి సామన్లు ఇవ్వలేమన్నారు. రాజకీయ నేతల ప్రోద్బలంతో పోలీసు స్టేషన్‌కి వచ్చి, స్టేషన్ ముందు ప్రసార మాధ్యమాలతో మాట్లాడడం సరికాదని పేర్కొన్నారు.
ఇదీ చదవండి :విజయసాయి రెడ్డి ట్వీట్‌కు రామ్మోహన్ ఘాటు కౌంటర్