రక్తహీనత కారణంగా నెల రోజుల బాలింత అయిన గ్రామ సచివాలయ ఏఎన్ఎం మృతి చెందింది. విశాఖ మన్యం పెదబయలు మండలం గోమంగి సచివాలయంలో ఏఎన్ఎంగా అరడ అమ్మాజీ విధులు నిర్వహిస్తోంది. నెల రోజుల కిందట బాలుడికి జన్మనిచ్చిన ఆమె రక్తహీనత సమస్యతో బాధపడుతోంది. జ్వరం, కాళ్లవాపు లక్షణాలతో నాలుగు రోజులుగా తీవ్ర అనారోగ్యం బారిన పడింది. ఆమెది స్వగ్రామం మారుమూల ప్రాంతమైన తల్లాబు. అక్కడ్నుంచి రవాణా సౌకర్యం లేకపోవడంతో డోలి సాయంతో తీసుకువచ్చి అంబులెన్స్ ద్వారా జి. మాడుగుల ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధరించారు. ప్రభుత్వ ఉద్యోగం వచ్చి కొద్దిరోజులు కాకముందే ఇలా ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
మన్యంలో విషాదం...సచివాలయ ఏఎన్ఎం మృతి
రక్తహీనత కారణంగా నెల రోజుల బాలింతైన గ్రామ సచివాలయ ఏఎన్ఎం మృతి చెందిన ఘటన విశాఖ జిల్లా మన్యంలో జరిగింది. నాలుగు రోజులుగా తీవ్ర అస్వస్థతకు గురైన ఏఎన్ఎం అరడ అమ్మాజీ ఆస్పత్రికి తరలించగా చనిపోయింది.
vishaka manyam